Job Mela: జనవరి 11న జాబ్ మేళా.. వివరాలు ఇవే..
అన్నమయ్య జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జనవరి 11వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ జనవరి 8న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మెడ్ ప్లస్ ఫార్మసీలో ఫార్మసిస్టులుగా, డిక్సన్ టెక్నాలజీ కంపెనీలో అసెంబ్లీ లైన్ ఆపరేటర్‌గా పనిచేయడానికి పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఫార్మసీ, బి-ఫార్మసీ, ఎం-ఫార్మసీ విద్యార్హతలు కలిగిన, 19 నుంచి 40 సంవత్సరాలలోపు వయస్సుగల అభ్యర్థులు అర్హులన్నారు.
ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.11076 నుంచి 18 వేలు వరకు హోదానుబట్టి జీతం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల మహిళా, పురుషు అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, ఫొటోలు తీసుకొని 11వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.
Job Mela: డీఎల్‌టీసీ ఐడీఐ శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళా
#Tags