Job Mela: రేపు జాబ్‌మేళా
కాళోజీ సెంటర్: ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విన్ మోటర్స్ (ఆథరైజ్డ్ మారుతి సుజుకీ డీలర్) కంపెనీలో కారు టెక్నీషియన్, ట్రెయినీ సర్వీస్ అడ్వైజర్ హనుమకొండ భీమారంలో పనిచేసేందుకు 30 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీఐ డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్ చదివిన అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారు అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి గల జిల్లాలోని నిరుద్యోగ యువకులు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఈనెల 21 ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. వివరాలకు 91770 97456 సంప్రదించాలని ఆమె సూచించారు.
#Tags