Job Mela: రేపు జాబ్‌మేళా

Job mela

డిచ్‌పల్లి: మండలంలోని బర్దిపూర్‌ శివారులోగల తిరుమల నర్సింగ్‌ కళాశాలలో ఈనెల 5న తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌), తెలంగాణలోని కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ, రిజిస్టర్‌ రిక్రూట్మెంట్‌ ఏజెన్సీ, వివిధ దేశాల్లో నర్సింగ్‌ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి సిరిమల్ల శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని నిర్దిష్ట నర్సింగ్‌, సంబంధిత ఉద్యోగ అవకాశాలు గురించి సమాచారాన్ని అందించడానికి వివిధ జిల్లాలో నమోదు డ్రైవ్‌/వర్క్‌షాపులను నిర్వహిస్తోందన్నారు. వివరాలకు 6302292450, 7893566493ను సంప్రదించాలన్నారు.

#Tags