ITI Jobs: ఐటీఐలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(టౌన్‌): నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఏటీఓ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నామని, ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ రజియా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను బాలికల ఐటీఐలో తీసుకోవాలన్నారు. పూర్తి చేసిన వాటిని ఈనెల 26వ తేదీలోపు బాలికల ఐటీఐలో సమర్పించాలన్నారు. బీఈ, బీటెక్‌ ఇన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఒక సంవత్సరం ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలి), డిప్లొమా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఫ్రం రికగ్నైజ్డ్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (రెండేళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలి), ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ పాస్డ్‌ ఇన్‌ ది ట్రేడ్‌ ఆఫ్‌ మెకానికల్‌ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనర్‌ (మూడేళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలి) విద్యార్హతలు ఉండాలన్నారు.

#Tags