AP Grama Ward Sachivalayam Employees News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Grama Ward Sachivalayam Employees News

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోజులో మూడు సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించింది.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 32438 ఉద్యోగాలు: Click Here

ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గం.లకు, సాయంత్రం 5 గంటల తర్వాత హాజరు వేయాలని జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిబంధన ఉండగా.. బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడంలేదన్న ఆరోపణలతో తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు:

ఇక నుంచి రోజుకు మూడుసార్లు హాజరు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీవోలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. మొబైల్ యాప్ లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరు నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

#Tags