Good News for Women: మహిళలకు గుడ్‌న్యూస్ అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
జిల్లాలో ఖాళీగా ఉన్న 4 అంగన్‌వాడీ కార్యకర్తలు, 26 సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నియామకాల కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
Teacher Posts: 2217 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్
కాకినాడ అర్బన్, తాళ్లరేవు, పెద్దాపురం, ప్రత్తిపాడు ప్రాజెక్టుల్లో ఒక్కొక్కటి చొప్పున కార్యకర్త పోస్టు, కాకినాడ అర్బన్‌లో 5, కాకినాడ రూరల్‌లో 4, తాళ్లరేవు 4, పిఠాపురం 6, తుని 4, జగ్గంపేట 3 చొప్పున మొత్తం 26 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
#Tags