Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ 13న జాబ్‌మేళాకు ఆహ్వానం

job Fair

కార్వేటినగరం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈనెల 13న నిర్వహించనున్న జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ గణేష్‌ తెలిపారు. ఐటీఐ కళాశాలలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా కార్యాలయం, డీఆర్‌డీఏ వారు సంయుక్తంగా స్థానిక ఐటీఐ ఆవరణలో జాబ్‌ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు.

DRDOలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here

జాబ్‌మేళాకు ఝాన్సన్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ముతూట్‌ పైనాన్స్‌ పాల్గొంటాయని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ లేదా డిగ్రీ పాస్‌, ఫెయిల్‌ అయిన 18 నుంచి 35 ఏళ్ల లోపువారు జాబ్‌ మేళాలో పాల్గొన వచ్చన్నారు. ఇతర వివరాలకు 81425 09017ను సంప్రదించాలని కోరారు.

#Tags