Good news for unemployed: నిరుద్యోగులకు శుభవార్త 19న జాబ్‌మేళా నెలకు 20వేల జీతం
రాయచోటి (జగదాంబసెంటర్): ఈ నెల 19వ తేదీన పీలేరు, తంబళ్లపల్లెలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్, జిల్లా ఉపాధి కార్యాలయం, డీఆర్‌డీఏ సీడాప్ అన్నమయ్య జిల్లా వారి ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీలతో ఉద్యోగమేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి అధికారి సురేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి అర్హతతో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు జీతం నెలకు 35000: Click Here
ప్రముఖ కంపెనీలలో వివిధ హోదాలలో పనిచేయుటకు అన్నమయ్య జిల్లాలోని నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. పది, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి 18 నుండి 30 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. కాగా నెలకు రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు హోదాను బట్టి జీతం ఉంటుందన్నారు. పీలేరులోని ఎస్‌జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అలాగే తంబళ్లపల్లెలోని టీఎన్‌వీఎస్‌ఆర్‌ఎం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళాలు నిర్వహించనున్నామన్నారు.