35000 Government Jobs News: నిరుద్యోగుల‌కు భారీ Good News..మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌

Government Jobs Latest news

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల‌కు భారీ గుడ్‌న్యూస్ చెప్పాడు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. అత్యంత  త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు ముఖ్య‌మంత్రి చెప్పారు. అలాగే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.  

ఏపీ తెలంగాణలో స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు: Click Here
 

వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం ఇలా..
వ‌చ్చే 10, 15 రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తామ‌న్నారు. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామ‌న్నారు. 

వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తామ‌న్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. 

#Tags