Free tailoring training for women: మహిళలకు 15 రోజుల ఉచిత టైలరింగ్ శిక్షణ

free tailoring training

నల్లగొండ టౌన్‌ : నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో 18 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసు గల లేబర్‌ కార్డున్న స్త్రీ, ఫురుషులకు 15 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఏడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ మారనున్న 10వ తరగతి పాస్‌ మార్కులు: Click Here

టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

టైలరింగ్‌, ఎలక్ట్రిషియన్‌, తాపిమేస్త్రీ, పెయింటింగ్‌ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నామని ఈ 15 రోజులకు రూ.4500 ఉపకార వేతనం, మధ్యాహ్న భోజనం, స్టేషనరీ, టీషర్టు, హెల్మెట్‌, బ్యాగు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ ఇస్తారని తెలిపారు. దరఖాస్తు కోసం 78933 32674, 90594 64647, 94417 95590 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

#Tags