Free Coaching: సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌కు ఉచిత శిక్ష‌ణ‌.. స‌ద్వినియోగం చేసుకోండి

సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌కు ఉచిత శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. దీనిని స‌ద్వినియోగం చేసుకోండి.

మొగ‌ల్రాజ‌పురం(విజ‌య‌వాడ తూర్పు): సివిల్ స‌ర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న యువ‌త‌కు త‌మ విద్యాసంస్థ త‌రుపున ఉచిత శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని విద్యాద‌ర్శిని ఐఏఎస్ అకాడ‌మీ సంస్థ చైర్మ‌న్ జి.విజ‌య్‌కుమార్ తెలిపారు. 
ఈ ఉచిత శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను రాష్ట్ర గృహ నిర్మాణ, స‌మాచార‌శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి విజ‌య‌వాడ‌లోని ఆయ‌న కార్యాల‌యంలో జులై 1వ తేదీ ఆవిష్క‌రించారు. 

ఈ సంద‌ర్భంగా పార్థ‌సార‌ధి మాట్లాడుతూ యువ‌త ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ప్ర‌భుత్వ, ప్రైవేటు క‌ళాశాల‌ల్లో డిగ్రీ చ‌దువుతున్న విద్యార్థులు త‌మ సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ప్ర‌వేశ ప‌రీక్ష‌కు హాజ‌రై ఉత్తీర్ణ‌త పొందాల‌ని, ప్ర‌వేశ ప‌రీక్షలో ప్ర‌తిభ చూపిన వారికి మాత్ర‌మే ఉచిత శిక్ష‌ణ త‌ర‌గ‌తుల్లో పాల్గొన‌డానికి అర్హుల‌న్నారు. 

Course Training: నిరుద్యోగ యువ‌తకు స్వ‌యం ఉపాధి కోర్సుల్లో శిక్ష‌ణ‌

అస‌క్తి ఉన్న యువ‌తీయువ‌కులు జులై 10 తేదీలోగా విజ‌య‌వాడ బెంజిస‌ర్కిల్‌లో ఉన్న విద్యాద‌ర్శిని ఐఏఎస్ అకాడ‌మీ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్నారు. ఉద‌యం 9 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 5 నుంచి 7.30 గంట‌ల వ‌ర‌కు త‌ర‌గ‌తులు జ‌రుగుతాయ‌ని అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం ఉన్న స‌మ‌యంలో ఏదో ఒక బ్యాచ్‌లో శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకావొచ్చ‌ని వివ‌రించారు. 
మ‌రిన్ని వివ‌రాల‌కు 93461 96829 నంబ‌రులో సంప్ర‌దించాల్సిందిగా ఆయ‌న కోరారు.  

#Tags