Skill Development Courses: నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు.. దరఖాస్తుల తేదీ పొడగింపు..
మణుగూరు టౌన్: సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల కుటుంబాలు, పునరావాస ప్రాంతాలే కాక పరిసర గ్రామాల నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుండగా, దరఖాస్తు గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీజీఎం(పర్సనల్) ఎస్.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Poster Launch: ఏప్రిల్ 1న 'ఎసెంట్రిక్స్ టెక్ ఫెస్ట్'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యాన కాస్మోటాలజీ, డ్రోన్ టెక్నీషియన్, సోలార్ టెక్నీషియన్, సెల్ టెక్నీషియన్, మెకానిక్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ తదితర 38 కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, పదో తరగతి అర్హత కలిగిన వారు ఈనెల 30వ తేదీలోగా www.scclmines.com/apprenticeship వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రతులను మణుగూరు వీటీసీ కార్యాలయంలో అందజేయాలని డీజీఎం సూచించారు.