Free Training: DSCలో ఉచిత శిక్షణ

DSC Free Training

అమలాపురం టౌన్‌: సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా జిల్లాలోని పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు.

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ క్లర్క్‌ ఉద్యోగాలు.. జీతం 32వేలు: Click Here

ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రెసిడెన్షియల్‌ ప్రాతిపదికన శిక్షణ ఇస్తామని, టెట్‌లో ఉత్తీర్ణులైన వారికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ జరుగుతుందన్నారు. దానిలో 85 శాతం, టెట్‌లో పొందిన మార్కుల్లో 15 శాతం వెయిటేజీ ఇస్తామని వివరించారు.

వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలలోపు ఉన్న వారిని ఎంపిక చేస్తామన్నారు. స్థానిక సచివాలయంలో ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ గడువు ఉందని, కోచింగ్‌ ఎంపిక కోసం ఈ నెల 27న ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తామన్నారు.

#Tags