DSC Free Training: మూడు నెలల పాటు డీఎస్సీ ఉచిత శిక్షణ
నరసరావుపేట: రాష్ట్రంలో షెడ్యుల్డ్ కులాలు, తెగల అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష ఉచిత శిక్షణకు భోజనం, వసతి సౌకర్యాలతో మూడు నెలల పాటు శిక్షణ పొందేందుకు ఈనెల 21వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్ సాధికారిత అధికారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి 25లోపు హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ చేసుకోవాలని, 27వ తేదీన పరీక్ష నిర్వహించటం జరుగుతుందన్నారు.
10వ తరగతి అర్హతతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు జీతం 40వేలు: Click Here
మెరిట్ లిస్టు ప్రకటన 28వ తేదీన, జిల్లాలవారీగా ఎంపికై నవారి జాబితా 30వ తేదీన, కోచింగ్ సెంటర్ల వారీగా అభ్యర్థుల ఎంపిక నవంబరు 3వ తేదీన, కోచింగ్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఎస్జీటీలకు ఇంటర్మీడియెట్‌తో పాటు డైట్‌సెట్, టెట్, స్కూల్ అసిస్టెంట్స్‌కు డిగ్రీ గ్రాడ్యుయేషన్, బీఈడీ, టెట్ విద్యార్హతలు కలిగినవారు అర్హులన్నారు. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ2.50లక్షల లోపు కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అర్హులన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags
- DSC Free Training
- Free training
- Free Coaching For DSC
- Good news For Students Free DSC Coaching
- DSC free training for three months Today Latest news
- AP DSC Free Coaching
- AP DSC Free Coaching News in Telugu
- Teacher job coaching
- ap government dsc free coaching applications
- Today Free training news in telugu
- ap government free coaching for dsc
- Trending news for DSC Free Training news
- AP State News
- latest news in ap today
- Free Training announcement for DSC
- Narasaraopet news