MLHP Counselling: ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌..

నేడు మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవెడర్స్‌ కోసం ఎంపిక చేసిన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైద్య ఆరోగ్యశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ వెల్లడించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్‌–4 పరిధిలో సోమవారం కడపలోని ఐఎంఏ హాలులో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌)/కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ నియామకాల కౌన్సెలింగ్‌ చేపడుతున్నట్లు ఆ శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రత్నకుమారి తెలిపారు.

Osmania University: ఓయూ బాటనీ విభాగానికి వందేళ్లు

రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 56 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారి జాబితాను హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. కడప మున్సిపల్‌ స్టేడియం వద్దగల ఐఎంఏ హాలులో ఉదయం 10 గంటల నుంచి జరిగే కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు హాజరు కావాలన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటికే అభ్యర్థులకు తెలియజేసామని ఆమె తెలిపారు.

#Tags