Multi Talented Student Success Story : 12 విభాగాల్లో నిర్వహించిన ఈ టెస్ట్‌లో 17 ఏళ్ల సూర్యతేజశ్రీ ప్రతిభ చూపి అమెరికాకు.. కానీ..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : మ‌నకు టాలెంట్ ఉంటే.. మ‌నం ప్ర‌పంచంలో ఉన్న‌త స్థానంలో ఉండ‌టానికి స‌రైన దారి చూపుతుంది. ఇప్పుడు మ‌న తెలుగు విద్యార్థులు ప్ర‌పంచంలో పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న‌త స్థానంలో ఉన్నారంటే.. అది కేవ‌లం వాళ్ల ప్ర‌తిభ వ‌ల్ల‌నే.

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన బందిల సూర్యతేజశ్రీ విద్యలో చూపిన ప్రతిభ కారణంగా అమెరికాలో ఉచిత విద్యను అభ్యసించే అరుదైన అవకాశాన్ని సాధించింది. ఈ నేప‌థ్యంలో సూర్యతేజశ్రీ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన బందిల సూర్యతేజశ్రీ నిరు పేద కుటుంబానికి చెందిన వారు. ఈమె తల్లి పేరు నాగమణి. ఈమె ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ప‌నిచేస్తుంది.

ఎడ్య‌కేష‌న్ : 
విజయవాడ ఈడ్పుగల్లులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ అండ్‌ నీట్‌ గురుకులంలో సూర్యతేజశ్రీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తిచేసింది. 

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

12 విభాగాల్లో నిర్వహించిన ఈ టెస్ట్‌లో..
గతేడాది అమెరికా ఫీల్డ్ సర్వీసెస్ సంస్థ(ఏఎఫ్‌ఎస్‌) కెన్నెడి లూగర్‌ యూత్‌ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించింది. 12 విభాగాల్లో నిర్వహించిన ఈ టెస్ట్‌లో 17 ఏళ్ల  సూర్యతేజశ్రీ పాల్గొని ప్రతిభ చూపింది. దీంతో అమెరికా మిషిగన్‌ రాష్ట్రంలోని హోప్కిన్‌లో ఏడాది పాటు ఉచితంగా డిప్లమో కోర్సును అభ్యసించేందుకు అర్హత సాధించింది. ఉచిత శిక్షణతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఏఎఫ్‌ఎస్‌ సంస్థ భరించనుంది.

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

ఈ కార్యక్రమంలో భా­గంగా ఆగ‌స్టు 18వ తేదీన‌ సూర్యతేజశ్రీ అమె­రికా వెళ్లింది. ఏపీ ప్రతినిధిగా ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలను అక్కడ తెలియజేయడం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం ఏర్పడింది.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

#Tags