YSRCP Government Education Scheme: జ‌గ‌న్న ప్ర‌భుత్వం అమలు చేసిన‌ విద్యా సాయానికి ప‌థ‌కం

విద్యార్థుల‌కు వైఎస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అందిస్తున్న సాయాని విదేశీ విద్యా దీవెన ప‌థ‌కాన్ని ప్రారంభించి, అనేక విద్యార్థుల‌కు విద్యా సాయాన్ని అందిస్తున్నారు. ప్ర‌భుత్వం చే ఎంత మందికి ఏ విధంగా సాయం అందుతుందో తెలుసుకుందాం..
YSRCP Education Scheme for students

సాక్షి ఎడ్యుకేష‌న్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం కింద ఇప్పటివరకు 1,830 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం లభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య పథకం అక్రమాల పుట్టగా మారిందని విజిలెన్స్‌ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకంలోని లోపాలను చక్కదిద్ది మరింత ఎక్కువ మందికి, మరింత ఎక్కువ ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

NSS Day In College: విద్యార్థులు సమాజ‌సేవ పట్ల బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి

దీనికింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులందరికీ సంతృప్త విధానంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయమందిస్తోంది. 21 నిర్దేశిత సబ్జెక్ట్‌ కేటగిరీల్లో 50 విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ప్రవేశం పొందినవారికి ట్యూషన్‌ ఫీజు కింద రూ.కోటి 25 లక్షల వరకు ఆర్థిక సాయం (వాస్తవ రుసుం) అందిస్తోంది. ఈబీసీలు రూ.కోటి వరకు ఆర్థిక సాయానికి అర్హులు.

Successful Dream: క‌ల‌ను నెర‌వేర్చుకున్న యువ‌కులు

గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే సాయం అందించేది. అంతేకాకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలకే పరిమితం చేసింది. ఆ ఆదాయ పరిమితిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.8 లక్షలకు పెంచింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులకు మేలు జరుగుతోంది.

#Tags