VIT-AP University: విట్‌ ఏపీ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు 6వ సమావేశం VIT-AP విశ్వవిద్యాలయంలో మార్చి 3-4 తేదీల్లో జరగనుంది. 'విశ్వవిద్యాలయాల్లో వైబ్రెంట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడం లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించే మొదటి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంగా VIT-AP నిలుస్తుంది.

ఈ కార్యక్రమానికి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,HEPB ఛైర్మన్, ప్రొఫెసర్ K. హేమచంద్రారెడ్డి,VIT-AP విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్,ప్రొఫెసర్‌ SV.కోటారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్‌ శ్యామలా రావ్‌, డా. బుద్దా  చంద్రశేఖర్‌, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ T. G. సీతారాం,VIT-AP యూనివర్సిటీ వ్యవస్థాపకుడు,ఛాన్సలర్ G. విశ్వనాథన్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. వీరితో పాటు  కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల డైరెక్టర్లు, వైస్‌ ఛాన్స్‌లర్లు ఈ సమావేశానికి పాల్గొంటారు. 

#Tags