Vidyadhan Scholarship 2023: పేద విద్యార్థుల‌కు 60 వేల వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్‌... ఇలా అప్లై చేసుకోండి

చ‌దువుల్లో చ‌క్క‌గా రాణిస్తూ, చ‌దువుకొన‌డానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల‌కు ఇదొక శుభ‌వార్త‌. ప‌దో త‌ర‌గ‌తిలో సాధించిన ఉత్తీర్ణ‌త శాతాన్ని ఆధారంగా చేసుకుని ఇంట‌ర్ చ‌దివేందుకు సరోజినీ దామోదరన్‌ ఫౌండేషన్ ఆర్థిక సాయం అంద‌జేస్తోంది.
Vidyadhan Scholarship

ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. వీరి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. అలాంటి విద్యార్థులకు ‘విద్యాదాన్‌’ ఉపకార వేతనాలు అందించనున్నారు. 

Record Breaking Salary: అత్య‌ధిక వేత‌నంతో అద‌ర‌గొట్టిన షాప్ కీప‌ర్ కొడుకు... కోట్ల ప్యాకేజీల‌తో ఆద‌ర్శంగా నిలుస్తున్న కుర్రాళ్లు

విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని సరోజినీ దామోదరన్‌ ఫౌండేషన్ భావన‌. ఈ లక్ష్యంతోనే ఫౌండేషన్‌ ద్వారా ఉపకార వేతనాలు అందిస్తున్నారు. దివ్యాంగులైతే పదో తరగతిలో 75 శాతం లేదా 7.5 సీజీపీఏ మార్కులు సాధించిన వారు అర్హులు.

ఫౌండేషన్‌ ఎంపికచేసిన విద్యార్థులకు ఇంటర్ చ‌దివేందుకు సంవత్సరానికి రూ.10 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అనంతరం విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న పై చదువులకు రూ.10వేల నుంచి రూ.60 వేల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు. 

చ‌ద‌వండి: 6 crore salary package: ఇది క‌దా స‌క్సెస్ అంటే... రోజుకు 1.6 ల‌క్ష‌లు.. ఏడాదికి 6 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన కుర్రాడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణకు చెందిన విద్యార్థులు జులై 15వ తేదీ వరకు www.vidyadhan.org ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలు, వివరాలకు 9663517131, ఇమెయిల్‌: vidyadhan.telangana@sdfoundationindia.com ను సంప్రదించవచ్చు.

చ‌ద‌వండి: నేడే ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ ఇదే..

#Tags