Aakash Education: విద్యార్థుల కల సాకారానికి ఆకాష్ ఎడ్యుకేషన్ కృషి..
లబ్బీపేట: వైద్యులు, ఇంజినీర్లు కావాలనుకునే విద్యార్థుల కలలను సాకారం చేయడానికి ఆకాష్ ఎడ్యుకేషనల్ సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనూప్ అగర్వాల్ చెప్పారు. అందులో భాగంగా 2024 ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న తమ కొత్త సెషన్‌కు విద్యార్థుల కోసం వివిధ స్కాలర్‌షిప్‌లను మంగళవారం ప్రకటించారు. స్కాలర్‌షిప్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి ఫౌండేషన్ కోర్సుల్లో ప్రవేశానికి 90 శాతం వరకూ స్కాలర్‌షిప్ అందించనున్నట్లు తెలిపారు.
Summative Assessment Exams: ఎస్‌ఏ–2 పరీక్షలు తేదీలు విడుదల
అమరవీరుల పిల్లలు, రక్షణ సిబ్బంది, తీవ్రవాద ప్రభావిత వ్యక్తుల పిల్లలకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నట్లు తెలిపారు. నిర్ణీత పరీక్ష రోజుల్లో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షకు హాజరు కావచ్చని, 60 నిమిషాల పాటు పరీక్ష ఉంటుందన్నారు. 8 నుంచి 12వ తరగతి విద్యార్థులు రాయవచ్చని పేర్కొన్నారు. ఆకాష్ వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.
Tags
- Scholarships
- education of students
- aakash education
- coaching in various courses
- Foundation courses
- students talent
- Online Exams
- Aakash Education Organization
- Education News
- Sakshi Education News
- NTR News
- Scholarships
- AnoopAgarwal
- AkashEducation
- EducationAnnouncement
- Students
- NewSession
- sakshieducation updates