IIT and IIM Admissions: ఐఐఎంలు, ఐఐటీల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్.. ఎంపికైతే ఆకర్షణీయ ప్రోత్సాహకాలు..!
సాక్షి ఎడ్యుకేషన్: ఈ ఇన్‌స్టిట్యూట్స్ ప్రతిభావంతులకు పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించడమేకాకుండా.. ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల్లో పీహెచ్‌డీ పూర్తి చేసుకుంటే.. బోధన, పరిశోధన రంగాల్లో ఉజ్వల కెరీర్ ఖాయం!! ఈ నేపథ్యంలో.. ఐఐఎంలు, ఐఐటీల్లో పీహెచ్‌డీ, ప్రవేశ ప్రక్రియ, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
ఐఐఎంలు.. దేశంలో మేనేజ్‌మెంట్ కోర్సులను అందించడంలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలు! అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలకు పెట్టింది పేరు.. ఐఐటీలు!! ఈ ఇన్‌స్టిట్యూట్స్ యూజీ, పీజీలే కాకుండా.. పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తూ పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి.
ఐఐఎంల్లో పీహెచ్‌డీకి మార్గం
ఐఐఎం క్యాంపస్‌లు మేనేజ్‌మెంట్ విభాగానికి సంబంధించిన పలు సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి. క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ, యూజీసీ–జేఆర్‌ఎఫ్ వంటి పరీక్షల స్కోర్లను ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. పలు ఐఐఎంలు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, క్వాలిటేటివ్ మెథడ్స్ వంటి ఇంజనీరింగ్ సంబంధిత స్పెషలైజేషన్లలోనూ పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి గేట్, జీఆర్‌ఈ వంటి పరీక్షల స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఐఐఎం–బెంగళూరు ఈ స్కోర్లు లేకున్నా.. సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్ కల్పిస్తోంది.
CPGET Notification 2024: సీపీగెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ప్రవేశానికి యూనివర్సిటీలు ఇవే..!
అర్హతలు
ఐఐఎంల్లో పీహెచ్‌డీకి సమానమైన ఎఫ్‌పీఎం (ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్)కు దరఖాస్తు చేసుకునేందుకు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు నిర్దేశిత ప్రామాణిక టెస్ట్‌ల (క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ తదితర) స్కోర్ తప్పనిసరి. అకడమిక్ ట్రాక్ రికార్డ్ బాగుండాలి. పీజీ ఉత్తీర్ణత ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. పీజీలో 55 శాతం మార్కులు, బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి.
కోర్సు వ్యవధి నాలుగేళ్లు
ఐఐఎంల్లో పీహెచ్‌డీ కోర్సు వ్యవధి కనిష్టంగా నాలుగేళ్లు, గరిష్టంగా ఏడేళ్లుగా ఉంది. ఈ ప్రోగ్రామ్స్‌లో తొలి రెండేళ్లు క్లాస్‌రూం ఆధారిత కోర్స్ వర్క్ ఉంటుంది. ఆ తర్వాత కాంప్రెహెన్సివ్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్, కాంప్రహెన్సివ్ ఎగ్జామినేషన్‌ల పేరుతో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు. వాటిని థీసిస్ అడ్వయిజరీ కమిటీలు లేదా ఎఫ్‌పీఎం రివ్యూ కమిటీలు మూల్యాంకన చేసి.. అభ్యర్థికున్న అవగాహన మేరకు తదుపరి దశ పీహెచ్‌డీ కోర్స్ వర్క్‌కు అనుమతి మంజూరు చేస్తాయి.
JEE Advanced Results 2024 : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల తేదీ ఇదే..! 'కీ' కూడా...
ఆర్థిక చేయూత
- ఐఐఎంల్లో పీహెచ్‌డీలో చేరిన విద్యార్థులకు ఆర్థిక చేయూత లభిస్తుంది. ఐఐఎం–బెంగళూరు, అహ్మదాబాద్‌లలో ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపుతోపాటు నెలకు రూ.42 వేల ఫెలోషిప్ అందిస్తారు. అదే విధంగా స్టార్టప్ గ్రాంట్ కింద మొదటి ఏడాదిలోనే రూ.75 వేలు; కాంటింజెన్సీ గ్రాంట్ కింద రెండో ఏడాది నుంచి అయిదో ఏడాది వరకు ప్రతి ఏటా రూ.25 వేలు అందిస్తారు.
- ఐఐఎం–ఉదయ్‌పూర్ ఫీజు మినహాయింపుతోపాటు మొదటి రెండేళ్లు నెలకు రూ.37 వేలు; ఆ తర్వాత కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ పూర్తి చేసుకుంటే.. నెలకు రూ.40 వేలు చొప్పున ఫెలోషిప్ అందిస్తోంది. ఇతర ఐఐఎంలు కూడా ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడంతోపాటు స్టడీటూర్ ఖర్చులు, కాంటింజెన్సీ గ్రాంట్, ఆన్–క్యాంపస్ వసతి సదుపాయం వంటివి కల్పిస్తున్నాయి.
ప్రవేశం క్లిష్టంగా
ఐఐఎంల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. దీంతో అప్లికేషన్ దశ నుంచే రివ్యూ కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. అకడమిక్ ట్రాక్ రికార్డ్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్‌తోపాటు రిఫరెన్స్ లెటర్స్‌ను పరిశీలిస్తుంది. అప్లికేషన్ దశలో అన్ని అంచెల్లో విజయం సాధిస్తే.. తదుపరి దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అప్లికేషన్‌లో పేర్కొన్న స్పెషలైజేషన్‌లో అభ్యర్థికున్న వాస్తవ ఆసక్తిని పరిశీలిస్తారు.
Landslide: తీవ్ర విషాదం.. కొండచరియల కారణంగా 2,000 మంది మృతి!!
ఐఐటీ, ఐఐఎంల్లో పీహెచ్‌డీ.. ముఖ్యాంశాలు
- దేశ వ్యాప్తంగా పలు ఐఐఎంలు, ఐఐటీల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్.
- క్యాట్, గేట్, జీఆర్‌ఈ, జీమ్యాట్, యూజీసీ నెట్ స్కోర్లతో దరఖాస్తు అవకాశం.
- 2024–25 సంవత్సరానికి పలు క్యాంపస్‌లలో మొదలైన దరఖాస్తు ప్రక్రియ.
- ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు మినహాయింపు.
- నెలకు కనిష్టంగా రూ.30 వేలు.. గరిష్టంగా రూ.50 వేల వరకు ఫెలోషిప్.
- బోధన, పరిశోధన రంగాల్లో ఉజ్వల కెరీర్ అవకాశాలు.
Degree Rankers: ఏయూ డిగ్రీ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ.. జిల్లా టాపర్‌గా ఈ విద్యార్థిని..!
ఐఐటీల్లో పీహెచ్‌డీ ఇలా
నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఐఐటీలు.. కోర్ బ్రాంచ్‌లు మొదలు తాజా ట్రెండ్‌గా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ.. ఇలా పలు విభిన్న విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అర్హతలు
ఐఐటీల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకునేందుకు బీటెక్, ఎంటెక్, నిర్దిష్ట స్పెషలైజేషన్లలో ఎమ్మెస్సీ తదితర అర్హతలుండాలి. అకడమిక్ రికార్డ్ 60 శాతం తగ్గకుండా ఉండాలి. వీటితోపాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోరు, సీఎస్‌ఐఆర్–యూజీసీ, ఎన్‌బీహెచ్‌ఎం, డీబీటీ, డీఎస్‌టీ జేఆర్‌ఎఫ్‌ల్లో ఏదో ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
బీటెక్ విద్యార్థులకు పీహెచ్‌డీలో అవకాశం కల్పించేందుకు ఐఐటీలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ(ఎంటెక్+పీహెచ్‌డీ) విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విధానంలో ప్రవేశం పొందిన వారు రెండేళ్లు క్లాస్ రూం స్టడీ తర్వాత గైడ్/ప్రొఫెసర్ పర్యవేక్షణలో పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఐఐటీలు పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నిట్‌లు, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీటెక్ ఉత్తీర్ణులకు గేట్ స్కోర్‌తో నిమిత్తం లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీరికి అకడమిక్ ట్రాక్ రికార్డ్ 7 సీజీపీఏ ఉండాలి. దీంతోపాటు మలిదశలో ఇంటర్వ్యూ, రాత పరీక్షల్లో విజయం సాధించాలి.
Online Evaluation Process: అధ్యాపకులు చేసే ఆన్‌లైన్ మూల్యాంకనం విధానం ఇలా..!
ఎంపిక
సంబంధిత అర్హతలున్న అభ్యర్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు నిర్దేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తుతోపాటు తమకు రీసెర్చ్ ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్ అంశాలను పేర్కొనాలి. గరిష్టంగా మూడు స్పెషలైజేషన్ అంశాలను పేర్కొనొచ్చు. వీటితోపాటు తాము పేర్కొన్న స్పెషలైజేషన్‌లలో ప్రతి దానికి స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్‌ను దరఖాస్తుతోపాటు జత చేయాలి. ఈ దరఖాస్తులను ఐఐటీల్లోని డిపార్ట్‌మెంట్‌లవారీగా ఉండే రీసెర్చ్ అడ్మిషన్స్ రివ్యూ కమిటీలు పరిశీలిస్తాయి. అందుబాటులో ఉన్న సీట్లు, అప్లికేషన్ల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తాయి.
రాత పరీక్ష.. ఇంటర్వ్యూ
షార్ట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులకు మలిదశలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటి ద్వారా అభ్యర్థులకు పరిశోధనల పట్ల ఉన్న ఆసక్తిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. పీహెచ్‌డీలో సీటుతోపాటు ఆర్థిక ప్రోత్సాహకాలకు మార్గం సుగమం అవుతుంది. ఐఐటీలు నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ (జామ్) ర్యాంకు ద్వారా కూడా పీహెచ్‌డీలో చేరే వీలుంది.
Kitchen Gardens: పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు.. విద్యార్థులకు అవగాహన సదస్సు..!
ఆర్థిక ప్రోత్సాహకాలు
పీహెచ్‌డీ దిశగా యువతను ఆకర్షించేందుకు ఐఐటీలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అయిదేళ్ల వ్యవధిలో ఉండే పీహెచ్‌డీ కోర్స్ వర్క్‌లో అసిస్టెన్స్‌షిప్ పేరుతో తొలి రెండేళ్లు నెలకు రూ.25 వేలు; తర్వాత నుంచి నెలకు రూ.28 వేలు చొప్పున అందిస్తారు. అదే విధంగా ఎంటెక్/ఎంఈ అర్హతతో పీహెచ్‌డీలో చేరిన అభ్యర్థులకు రీసెర్చ్ అసిస్టెన్స్ షిప్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీరిని రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలో రీసెర్చ్ అసిస్టెంట్స్‌గా నియమిస్తారు. ఇలా నియమితులైన అభ్యర్థులకు తొలి రెండేళ్లు రూ.28 వేలు; తర్వాత మూడేళ్లు రూ.31,500 అందిస్తారు. వీటితోపాటు పరిశోధనకు అవసరమైన బుక్స్, జర్నల్స్, ఇతర మౌలిక పరికరాలు (కంప్యూటర్, లేబొరేటరీ పరికరాలు తదితర) కొనుగోలుకు ఏటా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కాంటింజెన్సీ అలవెన్స్, ప్రతి ఏటా గరిష్టంగా రెండు నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్లకు హాజరయ్యేందుకు అవసరమైన ట్రావెల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏలు వంటివి కూడా ఉంటాయి.
ఉన్నత శిఖరాలు
ఐఐటీల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి సీఎస్‌ఐఆర్, ఇక్రిశాట్, ఐఐసీటీ, ఐసీఏఆర్, ఎన్‌జీఐఆర్‌ఐ, తదితర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో జూనియర్ సైంటిస్ట్‌లుగా అవకాశం లభిస్తుంది. ప్రైవేటు సంస్థల ఆర్ అండ్ డీ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా చేరితే ప్రారంభంలోనే నెలకు రూ.2 లక్షల వరకూ వేతనం అందుతుంది.
Tags
- IIT and IIM
- admissions
- notifications
- ph d courses
- Entrance Exam
- interview
- Ph D in IIT and IIM
- Eligible Candidates
- graduate students
- new academic year
- Competitive Exams
- Indian Institute of Technology
- Indian Institute of Management
- ph d admissions
- Education News
- Sakshi Education News
- ResearchOpportunities
- AcademicExcellence
- Scholarships
- CareerGrowth
- Incentives
- HigherEducation
- TeachingCareers
- IIMAdmissions
- IITAdmissions
- PhDAdmissions
- latest admissions in 2024
- sakshieducationlatest admissions