Unemployment Benefit Scheme : నిరుద్యోగ భృతి పథకం.. వీరికే లభిస్తుందా..!
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇంకా అమలు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్న సమయంలో వాటిని ప్రస్తుతం, అమలు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
పథకానికి అర్హులు ఎవరంటే..
ఈ నిరుద్యోగ భృతిలో భాగంగా.. ప్రతినెల రూ. 3000 నిరుద్యోగులకు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా ఈ పథకం గురించి అధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే చర్యలను, అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. ప్రతినెల నిరుద్యోగులు రూ. 3000 పొందాలంటే వారికి ఉండాల్సి అర్హతలు ఏంటి అనే విషయాన్ని తెలియజేసే పని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కేవలం 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న యువతకు మాత్రమే అని తెలిసింది.
Work from Home Jobs: ఇంటి నుంచే పనిచేసుకునే ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అంతేకాదు, వారికి ప్రతినెల రూ. 10,000కు మించి ఆదాయం ఉండకూడదట.. ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా కోర్సులను పూర్తి చేసిన వారు ఈ పథకానికి అర్హులంటూ సమాచారం. అంతే కాకుండా, వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాసులై ఉండాలని, పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు, ఇతర పథకాల లబ్దీ పొందనివారు. ఈ అర్హతలు ఉన్న యువకులకు మాత్రమే నిరుద్యోగ భృతి పథకం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలపై పూర్తి వివరాలను, అధికారికంగా త్వరలోనే తెలియజేస్తారని ఆశిస్తున్నారు ఎందరో నిరుద్యోగులు. మరి ఈ విషయం పైన నిరుద్యోగులు కాస్త ఆనందపడుతున్నప్పటికీ ఈ పథకాన్ని ఎప్పుడు అప్లై చేస్తారా అంటూ చాలా మంది ఎదురు చూస్తున్నారు.
Job Mela: 10వ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హులకు జాబ్‌మేళా జీతం నెలకు 18800
వీరికే అవకాశం..
అలాగే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కి మాత్రమే అర్హులట. అలాగే కుటుంబంలో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదని వారు పెన్షన్ కూడా తీసుకోకూడదని తెలియజేస్తున్నారు. ఇతర ప్రభుత్వ పథకాల నుంచి కూడా లబ్ధి పొందకూడదని తెలియజేస్తోంది. ఇలాంటి వారే నిరుద్యోగ భృతికి అర్హులని తెలిపారు .ఇలా ఎన్నో అర్హతలను తెలియజేస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని త్వరలోనే ఏపీ ప్రభుత్వం తెలియజేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇప్పట్లో అమలు అవుతుందో లేదో కూడా తెలియాల్సి ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)