TS POLYCET 2024: నేడు పాలిసెట్‌ ప్రవేశపరీక్ష..  గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి..

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో పాలిసెట్‌ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలిసెట్‌ కోఆర్డినేటర్‌ కనకయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళా శాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, బెండరాలోని డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు.

PG Diploma Courses: షుగర్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సులు.. ద‌రఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

పాలిసెట్‌కు జిల్లాలో 883 మంది హాజరు కానున్నారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్నారు. విద్యార్థులను గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారని పేర్కొన్నారు.

#Tags