Transfers : రికార్డ్స్‌ కరెక్షన్‌ అధికారాల బ‌ద‌లాయింపు

చిత్తూరు కలెక్టరేట్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో రికార్డ్స్‌ కరెక్షన్‌ అధికారాలను బదలాయింపు చేస్తూ రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్‌ విజయరామరాజు శుక్రవారం డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అపార్‌ కార్యక్రమంలో భాగంగా కరెక్షన్‌ అధికారాలు బదలాయింపు చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల రికార్డుల్లో అవసరమైన దిద్దుబాటు కోసం ఉత్తర్వుల్లో సూచించిన అధికారాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

Navodaya Admissions: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

ఎంఈఓ, గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు, డీవైఈఓలకు అధికారాలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల కరెక్షన్‌ అధికారాలు ఎంఈఓలకు, జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలకు సంబంధించి గ్రేడ్‌–2 హెచ్‌ఎంలకు అధికారాలు బదలాయించినట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ ఉన్నత స్కూళ్లకు డీవైఈఓలకు అధికారాలు అప్పగించారు. 2025 మార్చి వరకు ఇవి అమలులో ఉంటాయని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags