JIGNASA State Level Competition: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తృతీయ బహుమతి

జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీలో కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తృతీయ బహుమతి. రాష్ట్రస్థాయిలో జరిగిన డిగ్రీ కళాశాలల జిజ్ఞాస పోటీలో కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి మైక్రో బయాలజీలో తృతీయ బహుమతి గెలుచుకున్నది.

మే 1న‌ సాంస్కృతిక రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్ ఆఫ్ కాలేజిట్ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం గారి చేతుల మీదుగా 12,000 వేల రూపాయలు నగదు, జ్ఞాపిక ,  ప్రశంస పత్రమును వైస్ ప్రిన్సిపాల్  భవాని, మైక్రో బయాలజీ అధ్యాపకులు రాంచందర్, విద్యార్థులు అందుకున్నారు.

జిజ్ఞాస సూపర్ వైజర్ గా వ్యవరించిన మైక్రో బయాలజీ అధ్యాపకులు రామచందర్ ను,  పోటీలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ అలివేలు మంగమ్మ  అభినందించారు, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు.
చదవండి: 

Life Sciences Jobs: లైఫ్ సైన్సెస్ లో M.Sc చేశారా... అయితే ఈ 65 ఉద్యోగాలు మీ కోసమే

Electricity: అనరోబిక్‌ మీథనోట్రోపిక్‌ ఆర్కియా అని వేటిని పిలుస్తారు?

#Tags