Electricity: అనరోబిక్ మీథనోట్రోపిక్ ఆర్కియా అని వేటిని పిలుస్తారు?
Sakshi Education
వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్‌ను వాడుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పారు. ప్రయోగ ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించారు.
Heart Disease: మెటబాలిక్ సిండ్రోమ్‌గా దేనిని పరిగణిస్తారు?
ఇలా చేశారు..
- పరిశోధనలో భాగంగా కాండిడేటస్ మిథేనోపెరెండెన్స్ అనే బ్యాక్టీరియాకున్న ప్రత్యేక టాలెంట్‌ను గుర్తించారు. ఈ సూక్ష్మజీవులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతుకుతుంటాయి. ఇవి మీథేన్‌ను ఆక్సిజన్ అవసరం లేకుండానే విడగొట్టి శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
- ‘‘ఎన్‌ఎంఈ (అనరోబిక్ మీథనోట్రోపిక్) ఆర్కియా’’గా పిలిచే ఈ జీవులు కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా తమ సమీపంలోని పదార్ధాల నుంచి ఎలక్ట్రానులను విడగొడతాయి. కరెంటంటేనే ఎలక్ట్రానుల ప్రవాహం. అంటే ఇవి తమ దగ్గరలోని పదార్ధాలను ఆక్సిడైజ్ చేసి కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు కొద్దిగా నైట్రేట్ల సాయం తీసుకుంటాయి.
- ప్రయోగంలో భాగంగా ఈ సూక్ష్మజీవులను ఆక్సిజన్ రహిత ట్యాంకులో మీథేన్‌తో కలిపి ఉంచారు. దగ్గరలో ఒక మెటల్ ఆనోడ్‌ను జీరో ఓల్టేజ్ వద్ద సెట్ చేసి పెట్టారు. దీంతో ఈ మొత్తం సెటప్ ఒక బ్యాటరీలా మారిందని, ఇందులో ఒకటి బయో టెర్మినల్ కాగా ఇంకోటి కెమికల్ టెర్మినల్ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
- సదరు బ్యాక్టీరియా తమ దగ్గరలోని మీథేన్‌నుంచి ఎలక్ట్రానులను విడగొట్టి కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో దాదాపు చదరపు సెంటీమీటర్‌కు 274 మిల్లీ యాంప్‌ల కరెంటు ఉత్పత్తి అయింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఆధారంగా భారీ స్థాయిలో బ్యాక్టీరియా బ్యాటరీలను నిర్మించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
మొత్తం గ్రీన్‌హస్ వాయువుల్లో మీథేన్ వాటా?
- ప్రపంచ జనాభాలో 94 కోట్ల మంది (13 శాతం)కి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు.
- భూతాపాన్ని పెంచే గ్రీన్‌హౌస్ వాయువుల్లో మీథేన్ కీలకమైనది. మొత్తం గ్రీన్‌హస్ వాయువుల్లో దీని వాటా 20 శాతం.
- కార్బన్ డై ఆక్సైడ్‌తో పోలిస్తే మీథేన్ భూమిపై సూర్యతాపాన్ని 25 శాతం వరకు పట్టి ఉంచుతుంది.
- పశువ్యర్థాలు, బొగ్గు గనుల నుంచి ఎక్కువగా మీథేన్ విడుదలవుతుంది.
- భారీస్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గితే భూతాపం గణనీయంగా అదుపులోకి వస్తుంది.
Fungi-Plant Communication Network: హైఫే అని వేటిని అంటారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Published date : 18 Apr 2022 03:01PM