Heart Disease: మెటబాలిక్ సిండ్రోమ్‌గా దేనిని పరిగణిస్తారు?
మనిషిలో కుంగుబాటు(డిప్రెషన్) అనేది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే గుండె జబ్బులతో బాధిపడుతున్నవారిలో కుంగుబాటు అధికమని పేర్కొన్నారు. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు 55 నుంచి 75 ఏళ్లలోపు వయసున్న 6,500 మందిపై నిర్వహించిన ఈ నూతన అధ్యయనం ఫలితాలను ప్లోస్‌వన్ పత్రికలో ప్రచురించారు. ఆరోగ్యవంతుల్లో క్రమంగా డిప్రెషన్ లక్షణాలు బయటపడితే వారికి గుండెజబ్బుల ముప్పు పొంచి ఉన్నట్లేనని అధ్యయనంతో తేలింది.
Fungi-Plant Communication Network: హైఫే అని వేటిని అంటారు?
మనుషుల్లో కుంగుబాటును సృష్టించడంలో మెటబాలిక్ సిండ్రోమ్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధికంగా చక్కెర, నడుము చుట్టూ అధిక కొవ్వు, రక్తంలో అధికంగా చెడు కొలెస్టరాల్‌ను మెటబాలిక్ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు.
న్యాయాధికారుల సదస్సు–2022ను ఎక్కడ ప్రారంభించారు?
రెండు రోజుల రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు–2022ను ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
Fish Species: ప్రెడేటర్‌కు ఆహారమయ్యేవాటిని ఏమని అంటారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్