TG POLYCET 2024 Counseling: నేటి నుంచే పాలిసెట్‌ కౌన్సెలింగ్‌.. వెబ్‌ ఆప్షన్స్‌, సీట్ల కేటాయింపు వివరాలివే

రామన్నపేట: టీజీ పాలిసెట్‌–2024 ప్రవేశాలకు నేటి (గురువారం) నుంచి వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ బైరి ప్రభాకర్‌ తెలిపారు. ఈనెల 24 వరకు జరిగే ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాలిసెట్‌–24లో క్వాలిఫై అయిన విద్యార్థులు సర్టిఫికెట్‌ ధ్రువీకరణ స్లాట్స్‌ ఎంచుకోవచ్చని తెలిపారు.

22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ధ్రువీకరణ జరుగుతుందని, విద్యార్థులు తాము బుక్‌ చేసుకున్న స్లాట్‌ సమయానికి ఎంచుకున్న సెంటర్‌కి వెళ్లి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాలని కోరారు. విద్యార్థులు తమకు కావాల్సిన కోర్సులకు సంబంధించి WWW.TGPOLYCET.NIC.IN వెబ్‌ సైట్‌ ద్వారా ఆప్షన్స్‌ని ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు ఇచ్చుకోవచ్చని సూచించారు.

NEET 2024 Controversy: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌.. ముందు రోజు రాత్రే విద్యార్థుల చేతికి.. 30 లక్షలకు డీల్‌

ఆప్షన్స్‌ని నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 30న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీటు పొందిన విద్యార్థులు ఈనెల 30 నుంచి జూలై 7 వరకు వెబ్‌సైట్‌ ద్వారా ప్రవేశ రుసుము చెల్లించి సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని ప్రిన్సి పాల్‌ పేర్కొన్నారు.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు వారి అన్ని సర్టిఫికెట్స్‌ ఒరిజినల్‌తో పాటు ఒక కాపీ సెట్‌ జిరాక్స్‌ కూడా తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆప్షన్స్‌ను జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సి ఉంటుందని, వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని. యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ వివరాలు ఇతరులకు ఇవ్వకూడదని సూచించారు.

#Tags