Tenth and Inter Supplementary Exams: 27 కేంద్రాల్లో ప్రశాంతంగా ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంటరీ ప‌రీక్ష‌లు..

ప్ర‌శాంతంగా సాగిన ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో హాజ‌రైన‌, గైర్హాజ‌రైన విద్యార్థుల సంఖ్య వివ‌రాల‌ను వెల్ల‌డించారు డీఈఓ సుధాక‌ర్ రెడ్డి..

నంద్యాల: జిల్లాలోని 27 కేంద్రాల్లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీఈఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం జీవశాస్త్రం పరీక్షకు 5,065 మంది విద్యార్ధులకు గాను 2,726 మంది హాజరైనట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉదయం జరిగిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మొదటి సంవత్సరం 4,514 మంది విద్యార్ధులకు గాను 4,250 మంది హాజరయ్యారు.

Open School Exams: రేప‌టి నుంచి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు..

ఒకేషనల్‌ విద్యార్ధులు 204 మందికి గాను 176 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్‌ రెండో సంవత్సరం సప్లిమెంటరీ కెమిస్ట్రీ, కామర్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ మ్యూజిక్‌ పరీక్షలకు 1,240 మందికి గాను 1161 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్‌ పరీక్షకు 36 మందికి గాను 27 మంది హాజరైనట్లు ఇంటర్‌ విద్యాధికారి సునీత తెలిపారు.

CBSE Syllabus: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భ‌విష్య‌త్తు..

#Tags