Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

సాక్షి, హైదరాబాద్‌: మరికొన్నిరోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఈ క్రమంలో సెలవులపై మంగళవారం ఒక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్‌), 25 ఆఫ్షనల్‌(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్‌ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సెల‌వు, మార్చి 8న మ‌హా శివ‌రాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామ‌న‌వమి, జూన్ 17న బ‌క్రీద్, సెప్టెంబ‌ర్ 7న వినాయక చ‌వితి, అక్టోబ‌ర్ 10న ద‌స‌రా, అక్టోబ‌ర్ 31న దీపావ‌ళికి సెల‌వులుగా పేర్కొంది. ఈ సారి సంక్రాంతి, ద‌స‌రా, క్రిస్టమస్ పండ‌గ‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు ఎక్కువ రోజులు రానున్నాయి. అయితే 2024 ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి, అక్టోబ‌ర్ నెల‌లో ఎక్కువ రోజులు సెల‌వులు వ‌చ్చాయి. అలాగే భారీ వాన‌లు, బంద్‌ల వ‌ల్ల స్కూల్స్‌, కాలేజీల‌కు అనుకోని సెల‌వులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. 

 

 

#Tags