School Inspection: పాఠశాల తనిఖీ.. ఉపాధ్యాయులకు సూచన!

పాఠశాలను సందర్శించిన కలెక్టర​ జితేష్‌ అక్కడి పరిస్థితి, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను గురించి తెలుసుకొని ఉపాధ్యాయులకు సూచనలిచ్చారు..

 

మాచారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానిపేట, భవాని పేటతండా పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.

APSET Halltickets Released: ఏపీసెట్‌ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

పాఠశాలల్లోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల తలుపులు, కిటికీలు, విద్యుత్‌ కనెక్షన్‌, పాఠశాల భవనాల పరిస్థితి ముఖ్యంగా మూత్ర శాలల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ గుణాత్మక విద్యను అందించాలని కోరారు. ఎంపీడీవో గోపి బాబు, ఎంఈవో ఎల్లయ్య ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Gurukul Admission Exam: ఈ నెల 25న గురుకులంలో ప్రవేశానికి పరీక్ష..!

#Tags