Summer Camp: సైన్స్‌ సెంటర్‌లో సమ్మర్‌ హాబీ క్యాంప్‌.. ఎప్పుడు..?

విద్యా సంవత్సరంలో పరీక్షలు ముగిసిన విద్యార్థులంతా ఈ క్యాంపులో చేరి వారి ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌. క‍్యాంపులో నిర్వహించి, నేర్పించే సబ్జెక్టులు, వాటి వివరాలను స్పష్టించారు..

తిరుపతి: తిరుపతి సైన్స్‌ సెంటర్‌లో ఈనెల 29 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు ‘సమ్మర్‌ హాబీ క్యాంప్‌’ నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ శ్రీనివాస నెహ్రూ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని వివరాలను తెలిపారు. సమ్మర్‌ క్యాంప్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోసైన్సు, ఎలక్ట్రానిక్స్‌, ఆస్ట్రానమీ, రోబోటిక్స్‌ వంటి సబ్జెక్టులు ఉంటాయని పేర్కొన్నారు.

Centurion School: జేఈఈ, ఐఐటీకి ఎంపికైన సెంచూరియన్‌ స్కూల్‌ విద్యార్థులు

ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ క్యాంపు తరగతులను సద్వినియోగం చేసుకోవచ్చని.. సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌ 25వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని.. పూర్తి వివరాలకు 0877–2286202, 7989694681ను సంప్రదించాలని కోరారు.

Engineering College Annual Day: ఇంజినీరింగ్‌ కళాశాలలో ఘనంగా 47వ వార్షికోత్సవ వేడుకలు..

#Tags