SLAS Exam: నేటి నుంచి విద్యార్థులకు శ్లాస్‌ పరీక్ష..

స్టూడెంట్‌ లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (శ్లాస్‌) పరీక్షను జిల్లాలో మంగళవారం సమర్థవంతంగా నిర్వహించాలని సీఆర్‌ఎంటీలు, పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లకు డీఈవో ఎం.కమలకుమారి సూచించారు.

అమలాపురం టౌన్‌: స్టూడెంట్‌ లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (శ్లాస్‌) పరీక్షను జిల్లాలో మంగళవారం సమర్థవంతంగా నిర్వహించాలని సీఆర్‌ఎంటీలు, పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లకు డీఈవో ఎం.కమలకుమారి సూచించారు. డీసీఈబీ కార్యదర్శి బి.హనుమంతరావు అధ్యక్షతన స్థానిక విట్స్‌ స్కూలు ఆవరణలో సోమవారం సాయంత్రం శ్లాస్‌ పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు.

Digital Education: పాఠశాల స్థాయి నుంచే డిజిటల్‌ విద్య

ఈ సందర్భంగా డీఈవో కమలకుమారి మాట్లాడుతూ 4వ తరగతి విద్యార్థులకు నిర్వహించే శ్లాష్‌ పరీక్ష ద్వారా వారి అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసే వీలుంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 157 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏఎంఓ పిల్లి రాంబాబు మాట్లాడుతూ దీని ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులకు అభ్యాసన సామర్థ్యాల పెంపునకు అవసరమైన పాఠ్య పుస్తకాల రూపకల్పన జరుగుతుందన్నారు. డీసీఈబీ కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరీక్ష పేపర్లను సరఫరా చేస్తామని, ఓఎంఆర్‌ బేస్డ్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

jobs to freshers: ఆఫర్‌ లెటర్లు ఉన్నాయా.. అయితే మీకు ఉద్యోగమే..

సమగ్ర శిక్ష సెక్టోరల్‌ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ఈ శ్లాస్‌ పరీక్షను పర్యవేక్షిస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 3,168 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. డీఈవో కార్యాలయ ఏపీవో బి.ఆదినారాయణ, నోడల్‌ సీఆర్పీ వెంకట్‌లు శ్లాష్‌ పరీక్ష నిర్వహణపై అవగాహన కల్పించారు. మండల విద్యాశాఖాధికారులు ఎస్‌.దుర్గాదేవి, మెండి శ్రీనుబాబు పాల్గొన్నారు.

Open Tenth and Inter: పకడ్బందీగా ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ.. తేదీ..?

#Tags