Stress Management Program: పిల్లలకు తల్లిదండ్రులు, టీచర్ల సపోర్టు ఉండాలి..

విద్యార్థులకు గెలుపు మాత్రమే కాదు ఓటమి గురించి కూడా నేర్పించాలి..

ఆదిలాబాద్‌: స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంను పిల్లలతో పాటు తల్లిదండ్రులకు, లెక్చరర్లకు అవగాహన కల్పించాలి. ఒక పరీక్ష ఫెయిల్‌ అయితే జీవితం ఆగిపోతుందనే భావన తొలగిపోవాలి. తల్లిదండ్రులు, టీచర్ల నుంచి సపోర్టు వస్తే విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు ఫెయిల్‌ అయినా మా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారనే భరోసా కలిగి ఉంటారు. ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లే అవకాశం ఉండదు. 


– డాక్టర్‌ సునీల్‌ కుమార్, సైకియాట్రిస్టు, జిల్లా మానసిక ఆరోగ్య క్లినిక్, జీజీహెచ్‌ 

 Female Apprenticeship Enrolment Soars: మహిళా అప్రెంటిస్‌లకు పెరుగుతున్న డిమాండ్..

ఓటమిని ఎదుర్కోవడం నేర్పించాలి
ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు గెలుపు గురించి మాత్రమే నేర్పిస్తారు. కానీ పిల్లలకు ఓటమిని ఎదుర్కోవడం కూడా నేర్పించాలి. ఆత్మహత్య చేసుకునే వారిలో ఎక్కువగా సొసైటీకి భయపడి, ఎవరో ఏదో అనుకుంటారనే భయం వంటివే ఎక్కవగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పాఠాలను చదవాలి. పరీక్షల నాటికే అన్నీ ఒక్కసారిగా చదువుతామంటే పరీక్షల్లో ఏం రాయలేని పరిస్థితి నెలకొని ఫలితాలపై ప్రభావం చూపుతుంది. పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి చేయకుండా, స్వేచ్ఛగా చదువుకునేలా తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాలి.


– డాక్టర్‌ కవిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రముఖ సైకాలజిస్టు  

Summer Camp: విద్యార్థులకు ఈనెల 28 నుంచి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

#Tags