Sri Chaitanya Students Top In NASA ISDC Contest: నాసా కాన్ఫరెన్సుకు హాజరైన శ్రీచైతన్య విద్యార్థులు..500 డాలర్ల బహుమతి

అమెరికా NASA వారి ఆధ్వర్యంలో NSS నిర్వహించిన ISDC కాన్ఫరెన్సుకు శ్రీచైతన్య విద్యార్థులు హాజరయ్యారు. ప్రప​ంచంలోని నలుమూలల నుంచి, సుమారు 30 దేశాలకు చెందిన అనేక వందలమంది విద్యార్థులు హాజరవగా, వీరిలో 167 మంది  శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులే ఉన్నారని శ్రీ చైతన్య స్కూల్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ సీమ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ ఇతర విద్యాసంస్థ నుండి ఇంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఈ కాన్ఫరెన్సుకు ఎంపిక కాలేదు. భారతదేశం నుంచే 28,000 మంది విద్యార్థులు పాల్గొనగా 639 మంది శ్రీచైతన్య విద్యార్థుల భాగస్వామ్యంతో, 62 విన్నింగ్‌ ప్రాజెక్టులు గెలుచుకొని వరుసగా 11వ సారి వరల్డ్‌ నెం1గా, వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

TGPSC Group1 Prelims Answer Key: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీ విడుదల..అభ్యంతరాలకు 17 వరకు అవకాశం

గత 13 ఏళ్లుగా క్రమం తప్పుకుండా ఈ కాన్ఫరెన్సుకు హాజరవుతూ సరికొత్త రికార్డును సృష్టించింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి 35 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని, ఆర్టిస్టిక్‌ మెరిట్‌ కేటగిరీలో ఓ విద్యార్థి 500 డాలర్ల బహుమతిని అందుకున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్బంగా విజేతలు, వారి తల్లితండ్రులను అభినందించారు. 
 

#Tags