Sports School Admissions: స్పోర్ట్స్‌ స్కూల్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

యర్రగొండపాలెం: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో ఉన్న గురుకుల క్రీడా పాఠశాలలో చేరే విద్యార్థులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ బి.పెద్దిరాజు శుక్రవారం తెలిపారు.

Job Mela: మెగా జాబ్‌మేళా.. నెలకు రూ. 60వేల వరకు జీతం

2024–25 సంవత్సరానికి గాను 5వ తరగతిలో 30 సీట్లు, 7వ తరగతిలో 2, 8వ తరగతిలో 2, 9వ తరగతిలో 3 సీట్ల ప్రకారం ఖాళీగా ఉన్నాయని, అడ్మిషన్ల కోసం స్థానిక ఏపీ గిరిజన గురుకుల విద్యాలయం (పీటీజీ) బాలుర పాఠశాలలో ఈ నెల 17వ తేదీన ఎంపిక జరుగుతుందని తెలిపారు.

Btech Results: బీటెక్‌ ఫలితాలు విడుదల.. రెగ్యులర్‌తో పాటు సప్లిమెంటరీ రిజల్ట్స్‌

ఏపీలోని 3వ జోన్‌ పరిధిలో ఉన్న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన గిరిజన గురుకుల, ప్రభుత్వ ఆశ్రమ, ఇతర ప్రభుత్వ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు ఈ ఎంపికలో పాల్గొనవచ్చని చెప్పారు. విద్యార్థులు ఆయా పాఠశాలల్లోని ప్రిన్సిపాల్‌, హెడ్‌మాస్టర్‌తో పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకొని రావాలని, వివరాలకు సెల్‌ నంబర్‌: 95738 79433కు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
 

#Tags