Ganesh Immersion : గణేష్ నిమజ్జనం రోజున ఈ జిల్లాల్లో సెలవులు..
సాక్షి ఎడ్యుకేషన్: గణేష్ ఉత్సవాలంటేనే అదో అద్భుతమైన పెద్ద వేడుక. ఇక్కడ ఎందరో పిల్లలు, పెద్దలు పాల్గొంటారు. ఆడుతూ, పాడుతూ సంతోషంగా వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. అటువంటి, వినాయకుని నిమజ్జనం వేడుకను చూడాలంటే ముంబై తరువాత హైదరాబాదే ఉంటుంది. అయితే, ఈ నేపథ్యంలో ప్రభుత్వం గణేష్ నిమజ్జనం రోజున హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి వంటి జిల్లాల్లో పాఠశాలలకు, కాలేజీలకు, ఆఫీస్లకు సెలవు ప్రకటించింది సెలవును ప్రకటించింది.
Ganesh Immersion Holiday : గణేష్ నిమర్జనానికి సెలవు.. నవంబర్‌లో ఆ రోజు సెలవు లేదు!
నిమజ్జనానికి ఏర్పాట్లు..
రాష్ట్రంలో ఈనెల 17వ తేదీన వినాయకుని నిమజ్జనం వేడుకలకు జరిపేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. సిటీ వ్యాప్తంగా కృత్రిమ చెరువులను ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు అని వివరించారు. ఈ సమయంలో రోజంతా భారీ విగ్రహాల ఊరేగింపులు జరుగుతాయని రోడ్లపై ఎక్కడ కూడా కరెంట్ తీగలు, వైర్లు, చెట్ల కొమ్మలు అడ్డురాకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం. దీని కారణంగా చాలా చోట్ల వైర్లు, చెట్లు కట్ చేశారు.
ఖైరతాబాద్ విగ్రహం ఈసారి..
ప్రతీ ఏటా నిర్వహించినట్లే ఈసారి కూడా ఖైరతాబాద్ 70 అడుగుల విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారనే తెలుస్తోంది. అయితే, అక్కడ ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండేందుకు అక్కడి క్రేన్లను నెక్లెస్ రోడ్‌వైపు పంపించారు. అందువల్ల ఖైరతాబాద్ గణేశుణ్ని ఎక్కడ నిమజ్జనం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇలా, మహా వినాయకుని నిమర్జానానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
Tags
- ganesh immersion
- Telangana
- Schools Holidays
- government holiday
- ganesh idols immersion
- holiday news in telangana
- khairatabad ganesh 2024
- Hyderabad
- rangareddy
- medchal
- telangana districts holidays
- hussain sagar
- education institutions holidays
- Hyderabad Ganesh Immersion Holiday News in Telugu
- Education News
- Sakshi Education News