Special Training Classes: నిరుద్యోగులకు వృత్తి విద్య శిక్షణ తరగతులు

గుంటూరు రూరల్‌: గ్రామీణ యువతి యువకులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వారి ఉన్నతికి కృషి విజ్ఞాన కేంద్రాలు కృషి చేస్తున్నా యని లాంఫాం కృషి విజ్ఞాన కేంద్రం అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.గంగాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

లాంఫాంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ గ్రామీణ యువతి యువకులకు విలువ ఆధారిత వానపాముల ఎరువుల తయారీపై ఆరు రోజుల శిక్షణ తరగతు లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ నిర్వహించే శిక్షణ తరగతులకు ఆసక్తిగల అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు 94900 35258, 9489051559 సెల్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

చదవండి: Andhra Pradesh Govt Jobs: నిరుద్యోగులకు తీపి కబురు

#Tags