Skill Quest: రేపు ‘స్కిల్‌ క్వెస్ట్‌’.. 50 స్టాళ్ల ఏర్పాటుకు సన్నాహాలు.. ఎక్క‌డంటే..

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల నడుంబిగించింది.

ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ ‘స్కిల్‌ క్వెస్ట్‌’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేఖ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు, వ్యవస్థాపక దృక్పథంతో ముందుకు రావడానికి విద్యార్థులను ప్రేరేపించడం స్కిల్‌ క్వెస్ట్‌ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ఆహారం, పానీయాలు, కళలు, చేతిపనులు, మరమ్మతులు, సరదా ఆటలు, డయాగ్నస్టిక్‌లకు సంబంధించి దాదాపు 50 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ (బుధవారం) ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరుకానున్నట్టు ప్రిన్సిపాల్‌ చెబుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

విద్యార్థులను ప్రోత్సహించేందుకు..
డిగ్రీ పూర్తయిన తర్వాత చాలామంది విద్యార్థుల వ్యాపార రంగాన్ని ఎంచుకుంటారని, వాళ్లపై వాళ్లకు ఒక నమ్మకం తీసుకురావడానికి ఇలాంటి స్కిల్‌ క్వెస్ట్‌ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని అధ్యాపకులు చెబుతున్నారు. విద్యార్థులు తమ టాలెంట్‌ను రుజువు చేసుకోటానికి స్కిల్‌ క్వెస్ట్‌ ఒక చక్కని వేదికగా నిలుస్తుందని ఆ కళాశాల అధికారులు పేర్కొంటున్నారు.

విజయవంతం చేయాలి..
ఈ నెల 21వ తేదీన కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ క్వెస్ట్‌ కార్యక్రమాన్ని విద్యార్థులే నిర్వహిస్తారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రజలు, తల్లిదండ్రులు, ఇతర కళాశాలల విద్యార్థులు పాల్గొనాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు విద్యార్థులను ప్రోత్సహించాలి. – డాక్టర్‌ పి.సురేఖ, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌

Free Education in Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్‌ విద్య.. షెడ్యూల్‌ ఇలా..

#Tags