6th Graduation Day : నేడు ట్రిపుల్‌ ఐఐటీడీఎంలో 6వ స్నాత‌కోత్స‌వం.. బీటెక్ విద్యార్థుల‌కు ప‌ట్టాలు!

మొదటగా ఈ ట్రిపుల్‌ ఐటీ డీఎం విద్యా సంస్థ కాంచీపురం (తమిళనాడు) మెంటర్‌ ఇనిస్టిట్యూట్‌గా 2015 ఆగస్టు నెలలో ప్రారంభమైంది..

కర్నూలు: నగర శివారులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ (ట్రిపుల్‌ ఐటీ డీఎం)లో నేడు (శనివారం) 6వ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఏపీ పునర్విభజన చట్టం–2014 ప్రకారం ట్రిపుల్‌ఐటీడీఎంకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొదటగా ఈ విద్యా సంస్థ కాంచీపురం (తమిళనాడు) మెంటర్‌ ఇనిస్టిట్యూట్‌గా 2015 ఆగస్టు నెలలో ప్రారంభమైంది. మూడు బీటెక్‌ కోర్సులతో తరగతులు మొదలయ్యాయి. ఆ తరువాత మరో కోర్సుతో కలిపి మొత్తం నాలుగు కోర్సులతో ఏటేటా ఎంతో మంది యువ ఇంజినీర్లను ఈ సంస్థ తయారు చేస్తోంది.

TG DSC 2024: డీఎస్సీకి 2.79 లక్షల దరఖాస్తులు.. వీరికి డీఎస్సీలో..

అన్ని రకాల వసతులు

కాంచీపురం నుంచి 2018లో ట్రిపుల్‌ ఐటీడీఎంను కర్నూలుకు తరలించారు. నగర శివారులోని జగన్నాథగట్టుపై 151 ఎకరాల స్థలంలో శాశ్వత క్యాంపస్‌ను నిర్మించారు. గట్టులో లోయలు, ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ ఆర్కిటెక్చర్‌ నైపుణ్యంతో కట్టిన భవనాలతో క్యాంపస్‌ సరికొత్త కళను సంతరించుకుంది. రూ.218 కోట్లతో పనులు చేపట్టగా, తరువాత సుమారు రూ.300 కోట్లకు చేరింది. క్యాంపస్‌లో మొత్తం 11 భవనాలు, ఐదు సెమినార్‌ హాల్స్‌ ఉన్నాయి. అలాగే ఒక మల్టీపర్పస్‌ హాల్‌ వినియోగంలో ఉంది. ట్రిపుల్‌ఐటీడీఎంలో అడ్మిషన్‌ పొందేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

Job Offers : శ్రీసిటీ అల్స్టమ్‌లో ఉద్యోగావకాశాలు.. అర్హులు వీరే..

దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు అనుౖవైన వాతావరణం ఉండేలా క్యాంపస్‌ను అన్ని వసతులతో తీర్చిదిద్దారు. 151 ఎకరాల విస్తీరణంలోని క్యాంపస్‌లో 60 ఎకరాల్లో భవనాలు నిర్మించారు. క్రీడలకు సైతం ప్రత్యేకంగా ఇండోర్‌ స్టేడియం, జిమ్‌ ఏర్పాటు చేశారు. బాస్కెట్‌బాల్‌ ఆడేందుకు మైదానం, అలాగే మినీ క్రికెట్‌ స్టేడియాన్ని సైతం నిర్మిస్తున్నారు. విద్యార్థులకు పోస్టల్‌ సేవల కోసం ప్రత్యేకంగా పోస్టల్‌ కార్యాలయం, 24 గంటల వైఫై ద్వారా ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సంగీతం, నృత్యాలలో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు డిజిటల్‌ లైబ్రరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఉన్నటువంటి 25 ట్రిపుల్‌ ఐటీల్లో కర్నూలు ట్రిపుల్‌డీఎం అనతికాలంలోనే పేరుగాంచింది.

Palamuru University: పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి మరో నాలుగు పీజీ సీట్లు

143 మందికి బీటెక్‌ పట్టాలు

కర్నూలు ట్రిపుల్‌ ఐటీడీఎంలో 2015లో మొదటగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్సు కోర్సులు ప్రారంభమయ్యాయి. 2019–20 అకడమిక్‌ ఇయర్‌ నుంచి అదనంగా ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ డాటా సైన్స్‌ అనే మరో బీటెక్‌ కోర్సును, మూడు పీహెచ్‌డీ కోర్సులను ప్రారంభించారు. మొదట 75 సీట్లతో ఉన్న బీటెక్‌ కోర్సులు నేడు (2023–24) 271 సీట్లకు పెరిగాయి. ఈ విద్యా సంవత్సరంలో మరి కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. 6వ స్నాతకోత్సవంలో 2020–24 బ్యాచ్‌కి చెందిన బీటెక్‌ విద్యార్థులకు 143 మందికి పట్టాలు అందించనున్నారు.

Govt and Private ITI Counselling : ప్ర‌భుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చేరేందుకు ఈ రెండు రోజులు కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌..

అదే విధంగా సీఎస్‌ఈలో ఒకరికి, ఈసీఈలో ఒకరికి, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఒకరికి, ఓవరాల్‌గా ఒకరికి, క్యాంపస్‌ టాపర్‌గా ఒకరికి మొత్తం ఐదుగురు విద్యార్థులకు బంగారు పతకాలను అందజేయనున్నారు. క్యాంపస్‌లోని కృష్ణ సెమినార్‌ హాలులో జరుగనున్న స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్‌ సభ్యులు, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ సరస్వత్‌ హాజరుకానున్నారు. ట్రిపుల్‌ ఐటీడీఎం డైరెక్టర్‌ ఆచార్య బి.ఎస్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ కె.గురుమూర్తి పాల్గొననున్నారు.

Group 1 Prelims OMR Sheets: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ స్కాన్డ్‌ ఓఎంఆర్‌ షీట్లు సిద్ధం

#Tags