Engineering Web Options : వెబ్‌ ఆప్షన్స్ ప్ర‌క్రియ‌లో విద్యార్థుల‌కు నిరాశ‌.. కార‌ణం!

ఇంజినీరింగ్‌లో అడ్మిష‌న్లు పొందేందుకు వెబ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూసిన విద్యార్థుల‌కు నిరాశ ఎదురైంది..

మురళీనగర్‌: ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్లు ఎంపికకు సోమవారం సర్వర్‌ పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. సోమవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ షెడ్యూలు ప్రకటించింది. కానీ మొదటి రోజు వెబ్‌సైట్‌లో వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు సంబంధించి సైట్‌ ఓపెన్‌ కాలేదు.

Job Interviews : రేపు జూనియ‌ర్ క‌ళాశాల‌లో జాబ్ మేళా.. ఈ విధంగా!

కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కంచరపాలెం గైస్‌లకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవడానికి అనేక మంది విద్యార్థులు చేరుకుని నిరాశతో వెనుతిరిగారు. మొదటి రోజు వెబ్‌సైట్‌లో టెక్నికల్‌ సమస్య వల్ల ఒక రోజు గడువును కోల్పోయినందున షెడ్యూలో వెబ్‌ ఆప్షన్లకు మరో రోజు పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Inter Admissions : ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల తేదీ పొడ‌గింపు..

#Tags