Schools Re-Open: తెలంగాణలో మోగిన బడి గంట.. నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గవర్నమెంట్‌, ప్రైవేట్‌ బడులన్నీ తెరుచుకున్నాయి. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఈ ఉదయం నుంచి అన్ని స్కూల్స్‌, కాలేజీల బస్సుల ఫిట్‌నెస్‌లను పరిశీలిస్తున్నారు. ఫిట్‌గా లేని బస్సులు, వ్యాన్‌లను సీజ్‌ చేస్తున్నారు. 

మరోవైపు.. ఇవాళ్టి నుంచి బడులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. నిన్ననే స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట చెకప్‌ లిస్ట్‌ పంపించారు అధికారులు. అయినా కొన్ని విద్యా సంస్థలు బస్సులు, వ్యాన్‌లను ఆర్టీఏ కార్యాలయాలకు ఫిట్‌నెస్‌ టెస్టులకు పంపలేదు. దీంతో అధికారులే రంగంలోకి దిగి దాడులు నిర్వహిస్తున్నారు. 

Good News For Students : విదార్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఇకపై యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇలా..

ఇక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు.

#Tags