School Holidays Cancelled : పాఠ‌శాల‌కు ఈ పండ‌గల‌ సెల‌వులు ర‌ద్దు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : పాఠ‌శాల‌కు విద్యార్థుల‌కు సెల‌వులు ఎప్పుడెప్పుడు వ‌స్తాయో అని ఎదురు చూస్తుంటారు. మ‌రి పండ‌గ‌లు వ‌స్తే.. వీరి ఆనందంకు అవ‌ధులు ఉండ‌వ్‌. ఎందుకంటే.. పండ‌గ రోజు స్కూల్‌కు సెల‌వులు ఇస్తారు.. అలాగే ఆ పండ‌గ‌ను కూడా ఆనందంగా జ‌రుపుకోవ‌చ్చు అనే మూడ్‌లో ఉంటారు.

కానీ ఈ ప్ర‌భుత్వం ముఖ్య‌మైన పండ‌గ‌ల‌కు ఇచ్చే సెల‌వుల‌ను కూడా ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు స్కూల్ హాలీడేస్ పై బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ 2024 సెలవు జాబితాను విడుదల చేసిన విష‌యం తెల్సిందే. అయిుతే ఇందులో అత్యంత ముఖ్య‌మైన‌ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, వసంత పంచమి, తీజ్, జీవితపుత్రిక  పండగల సెలవులను రద్దు చేసింది. అంతే కాకుండా మేడే, గాంధీ జయంతి రోజల్లో ఉన్న సెలవులను రద్దు చేసింది. 

 AP Sankranthi Holidays List 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి పండ‌గకు మొత్తం సెల‌వులు ఎన్ని రోజులంటే..?

ఏడాదిలో 22 రోజులు మాత్రమే..

మరోవైపు రంజాన్, బక్రీద్‌ల‌కు చెరో మూడు రోజులు, మొహర్రానికి  రెండు రోజులు సెలవులు ప్రకటించింది. అదే సమయంలో, గురుగోవింద్ సింగ్ జయంతి, రవిదాస్ జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయులకు ఉన్న 60 రోజుల సెలవుల్లో 38 రోజులు పాఠశాలకు రావాల్సి ఉంటుంద‌ని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏడాదిలో 22 రోజులు మాత్రమే సెలవు ఉంటుందని ప్ర‌భుత్వం తెలిపింది.  టీచర్లకు సమ్మర్ వెకేషన్ క్యాన్సిల్ చేసింది. తాజా క్యాలెండర్‌పై నితీష్ ప్రభుత్వంపై వివిధ వ‌ర్గాల వారు మండిప‌డుతున్నారు.

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

#Tags