School Admissions 2024: ప్రభుత్వ పాఠశాలకు డిమాండ్‌.. ‘నో అడ్మిషన్‌’ బోర్డు పెట్టక తప్పలేదు

నారాయణపేట రూరల్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్‌ ఉన్నత పాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమై పక్షం రోజులు కాకముందే 245 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 859కి చేరింది. ఒక్కో తరగతిలో 40 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 60 నుంచి 80 మంది విద్యార్థులను కూర్చోబెట్టాల్సి వస్తుంది. మరిన్ని అడ్మిషన్లు తీసుకుంటే ఇబ్బందులు తప్పవని భావించి గురువారం పాఠశాల ఎదుట నో అడ్మిషన్‌ బోర్డు ఏర్పాటు చేశారు.

TS 10th Class Supplementary Exams 2024 Results : టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

పాఠశాల పట్టణ నడిబొడ్డున, బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉండటంతో పాటు గత కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పాఠశాల అభివృద్ధికి రూ.23 లక్షలకుపైగా నిధులు కేటాయించడంతో ఎంతో సౌకర్యంగా మారింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టీసీలు పట్టుకొని ఇదే పాఠశాలకు వస్తున్నారు.

#Tags