Scholarship Program: పీఎం స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

ఖమ్మంమయూరిసెంటర్‌ : 2024 – 25 విద్యా సంవత్సర పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలకు నూతన విధి విధానాలు విడుదలయ్యాయని, వాటి ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఇ–పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సెస్సీ మెమో, విద్యార్థి ఆధార్‌కార్డులో సమాచారం ఒకే విధంగా ఉండాలని సూచించారు.

LLB Exams: ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి పట్టణాల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థి మార్కుల మెమో, ఆధార్‌ వివరాలతో ఇ–పాస్‌లో దరఖాస్తు చేసుకుంటే 12 అంకెల ఈ–పాస్‌ ఐడీ వస్తుందని, సర్టిఫికెట్లలో వివరాలు సరిపోలకపోతే ఆధార్‌ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.

Free training on computer skills: కంప్యూటర్‌ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ.. నెలకు రూ. 15వేల వేతనం

ఈ–పాస్‌ ఐడీ వచ్చిన తర్వాత మీసేవా కేంద్రంలో బయోమెట్రిక్‌ వేయాలని తెలిపారు. అనంతరం ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసి, సంబంధిత ధృవపత్రాలు జతపర్చి సంబంధిత కళాశాలలో సమర్పించాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags