Students Talent: విద్యార్థుల ప్రతిభకు ఉగాది పురస్కారాలు..

విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలో ప్రతిభను కనబరిచిన వారికి పురస్కారాలను అందజేసారు. అలాగే, విద్యలో ఇష్టంగా మెలగాలని తెలిపారు విద్యాశాఖ ఏడీఆర్‌ రవికుమార్‌. ఈ సందర్భంగా విద్యార్థులతో మరింత ప్రోత్సాహకంగా మాట్లాడారు

 

అనకాపల్లి: కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదవడంతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా విద్యాశాఖ ఏడీఆర్‌ ఆడారి రవికుమార్‌ అన్నారు. మండలంలోని తుమ్మపాల గౌరీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 3న సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉగాది సందర్భంగా బహుమతులు అందించారు.

Easy English: మేధా ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఈజీ ఇంగ్లీష్‌ శిక్షణ.. వివరాలు ఇవే!

మండలంలోని పి.దేదీప్యకు ప్రథమ బహుమతిగా రూ.5 వేలు, ఎస్‌.హర్షవర్ధన్‌కు ద్వితీయ బహుమతిగా రూ.3 వేలు, ఆర్‌.జాహ్నవికి తృతీయ బహుమతిగా రూ.2 వేలు నగదుతోపాటు, జ్ఞాపికలను అందించారు. మరో 10 మందికి ప్రోత్సాహక బహుమతులుగా రూ.వెయ్యి నగదు, జ్ఞాపికలను అందించి సత్కరించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఆడారి నారాయణమూర్తి, గౌరవ అధ్యక్షులు రాపేటి నాగేశ్వరరావు, ఆళ్ల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

TS TET 2024: ‘టెట్‌’ దరఖాస్తు గడువు పెంపు!.. ఇప్పటి వరకూ వ‌చ్చిన‌ దరఖాస్తులు ఇలా..

#Tags