Private schools: ప్రైవేట్‌ స్కూళ్లకు ఝలక్‌.. బుక్స్‌, యూనిఫాంలు అమ్మడానికి వీల్లేదు

వేసవి సెలవులు పూర్తి కానున్నాయి. త్వరలోనే పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పాఠశాల ప్రాంగణంలో యూనిఫాంలు, షూ, బెల్ట్‌ మొదలైనవాటిని విక్రయించకూడదంటూ అన్ని ప్రైవేటు పాఠశాలలకు డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రైవేట్ (అన్-ఎయిడెడ్) స్కూళ్లలో యూనిఫాం, షూస్ అమ్మడాన్ని నిషేదించాలని తెలిపారు.

TS ICET 2024 Hall Tickets: టీఎస్‌ ఐసెట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

హైదరాబాద్ జిల్లా పరిధిలోని స్టేట్ సిలబస్, CBSE, ICSE సహా అన్ని ప్రైవేట్‌ స్కూళ్లలో నోట్‌ బుక్స్‌, యూనిఫాం లాంటివి విక్రయించకూడందంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ స్టేషనరీ విక్రయాలు ఏమైనా ఉంటే వాణిజ్య రహితంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని స్పష్టం చేశారు.

నిబంధనలు అతిక్రమిస్తే పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్‌ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
 

#Tags