Paramedical courses Admissions: పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
పారామెడికల్‌లో మొత్తం 21 కోర్సులు ఉండగా నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ (డీఎంఎస్టీ), డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ (డీఈసీజీ) కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కో కోర్సులో 30 సీట్ల చొప్పున కేటాయించారు.
విద్యార్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులు
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 20, 2024
వివరాలకు: www. tgpmb. telangana. gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
NFC Hyderabad Recruitment 2024: న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో 300 ఖాళీలు.. పూర్తి వివరాలివే
మంచిర్యాలలో..
మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల 2022లో ఏర్పడగా, ఇటీవలే మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రస్తుతం 300ల మంది వైద్య విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పారా మెడికల్‌లో 21 కోర్సులు ఉన్నాయి. డీఎంఎల్టీ, డీఎంఎస్‌టీ కోర్సులు ప్రారంభించింది.
డీఎంఎల్టీ (డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్)లో 30 సీట్లు, డీఎంఎస్‌టీ (డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్)లో 30 సీట్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది.
NID Admissions: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో అడ్మీషన్స్.. చివరి తేదీ ఇదే
ఈ కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫారం, వివరాలకు www. tgpmb. telangana. gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించడం, 040–24653519 నంబరులో సంప్రందించాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)