Law Exam Results: లా ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో లా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వైస్ చాన్సిలర్ (వీసీ) ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి విడుదల చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలోని రెండు న్యాయ కళాశాలల్లో మూడు సంవత్సరాల లా కోర్సు పరీక్షలకు 320 మంది విద్యార్థులు హాజరవగా, 223 మంది ఉత్తీర్ణులై 69.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ వెల్లడించారు.
అదేవిధంగా ఐదు సంవత్సరాల లా కోర్సుకు సంబంధించి 64 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 40 మంది పాసై 62.05 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రెండు సంవత్సరాల పీజీ లా కోర్సు పరీక్షకు 44 మంది విద్యార్థులు హాజరవగా, 40 మంది పాసై 91 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఏకేయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కేవీఎన్ రాజు తెలిపారు.
Aryan Roshan: ఐఐటీలో సీటు.. ఫీజు చెల్లించలేని దుస్థితి
మొదటి సెమిస్టర్ లా పరీక్ష ఫలితాల్లో స్థానిక ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి యూనివర్శిటీ స్థాయి ర్యాంకులు సాధించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వీసీ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, సీఈ డాక్టర్ కేవీఎన్ రాజు, తదితరులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్, సీటీఏ డాక్టర్ జి.సోమశేఖర్, ఏసీటీఏ డాక్టర్ ఆర్.శ్రీనివాస్, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.