Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 6న జాబ్‌మేళా

కాళోజీ సెంటర్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 6న వరంగల్‌ ములుగు రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.

NEET-UG Row: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మరో అరెస్ట్‌.. కీలక విషయాలు వెల్లడి?

‘దృష్టి’ ఐటీ సెక్యూరిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వరంగల్‌, హనుమకొండల్లో స్టోర్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, సీసీ టీవీ టెక్నీషియన్‌గా పనిచేసేందుకు ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

అభ్యర్థులు 21 నుంచి 30 సంవత్సరాలోపు ఉండి స్టోర్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌కు డిగ్రీ పాసై, సీసీ టీవీ టెక్నీషియన్‌కు ఎస్సెస్సీ పాసై ఉన్న యువతి, యువకులు అర్హులని పేర్కొన్నారు.

NEET Exam Row: నీట్‌ కాంట్రవర్సీ.. మరోసారి పరీక్ష నిర్వహించాల్సిందేనా? దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష అవసరమా?

ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 6న ఉదయం 11గంటల వరకు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌ కాపీలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలన్నారు. వివరాలకు 93461 05589 ఫోన్‌ నంబర్‌ ద్వారా నూతన్‌కుమార్‌ను సంప్రదించాలని సూచించారు.
 

#Tags